ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సో మవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వి విధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
మహిళలు ధైర్యంగా సంప్రదించాలి
మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యం సంప్రదించాలని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌లో జిల్లాలో 83 హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి, 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 13 ఫిర్యాదులు స్వీకరించగా, ఏడుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. 4 కేసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 2 కేసుల్లో కౌన్సెలింగ్ అందించినట్లు వివరించారు. వేధింపులకు గురైతే ఆసిఫాబాద్ షీటీం నం.87126 70564, కాగజ్‌నగర్ షీటీం నం.87126 70565 లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.


