ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్ వేతనాలు చె ల్లించాలని డిమాండ్ చేస్తూ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఎస్సీ, బీసీ పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో పనిచేసే ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులకు 14 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు సత్యశ్రీ, రేవతి, కవిత, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


