కనికరం చూపండి | - | Sakshi
Sakshi News home page

కనికరం చూపండి

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

భార్యాభర్తలం ఇద్దరం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సొంతిల్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రెండో జాబితాలో మాపేరు ఉంది. పేదలమైన తమపై అధికారులు కనికరం చూపి ఇల్లు మంజూరు చేయాలి.

– సుమన్‌జీత్‌కౌర్‌, రెబ్బెన

ఇంటిని కూల్చివేయొద్దు

చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలోని సర్వే నం.174లో రెండు గుంటల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నా. 20 ఏళ్లుగా అందులోనే ఉంటున్నా. అప్పటి సర్పంచ్‌ ఇంటి నిర్మాణం కోసం పట్టా కూడా ఇచ్చారు. నా వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి నా ఇంటిని కూల్చివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

– నగేష్‌, డబ్బా, మం.చింతలమానెపల్లి

విరాసత్‌ చేయండి

దహెగాం మండలం కమ్మర్‌పల్లి శివారులోని 12.23 ఎకరాల భూమి ఉంది. తాత, తండ్రి మరణించినందున ఆ భూమిని తన పేరిట విరాసత్‌ చేయాలి. ప్రస్తుతం రైతుభరోసా, ఇతర పథకాలను లబ్ధి పొందలేకపోతున్నాను. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు భూమిని పరిశీలించి న్యాయం చేయాలి.

– సజ్జత్‌ అలీఖాన్‌, బెజ్జూర్‌

Advertisement
 
Advertisement
Advertisement