రెబ్బెన: గోలేటి స్పో ర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన దీకొండ సంజీవ్‌కుమార్‌ను ప్రకటించినట్లు రీజి యన్ చైర్‌పర్సన్ లయన్ బొమ్మ బాపురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. క్లబ్ ఆధ్వర్యంలో పేదల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన రీజియన్ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో క్లబ్‌కు మరింత మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు.


