● అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చే యాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం డీఐఈవో రాందాస్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఈ నెల 13 నుంచి 21 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫస్టియర్‌లో 1,770 మంది, సెకండియర్‌లో 697 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.


