కౌటాల: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలని డీఏవో వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో అందిస్తున్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతోపాటు సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు వినియోగించుకోవాలన్నారు. ఒకే రకమైన పంట సాగు చేయకుండా మార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కుమురం మాంతయ్య, ఏవో ప్రేమలత, సీఈవో రాజేశ్, ఏఈవోలు అంజన్న, ఘన్‌శ్యాం, కవిత, కల్పన, రేష్మిత తదితరులు పాల్గొన్నారు.


