మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

ఆసిఫాబాద్‌: జిల్లాల్లో మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హమాలీలు, వాహనాలు, గన్నీబ్యాగుల కొరతను నివారించాల ని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ హాజరయ్యారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేపడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సహకార శాఖ అధికారి మోహన్‌, డీఏవో వెంకటి, డీటీవో రామ్‌చందర్‌, మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement