కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందనను కలిసి వినతిపత్రం అందించారు. ఎనిమిదేళ్లుగా పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.


