గూడు చెదిరింది..! | - | Sakshi
Sakshi News home page

గూడు చెదిరింది..!

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

● దహెగాం మండలంలో గాలివానకు దెబ్బతిన్న ఇళ్లు

దెబ్బతిన్న దుర్గం శంకర్‌ ఇల్లు

ధ్వంసమైన అల్లూరి నాందేవ్‌ ఇల్లు

బామానగర్‌లో గాలివానకు రేకులు లేచిపోయిన ఇంటి వద్ద బాధితుడు

దహెగాం మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి పలువురు ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో నిల్వ సరుకులు, వస్తువులు, దుస్తులు తడిసిపోయాయి. ఇనుప రేకులు ఎగిరిపోయి విద్యుత్‌ స్తంభాలపై చిక్కుకున్నాయి. ప్రాణపాయం తప్పినా భారీగా ఆస్తినష్టం జరిగింది. దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, ఒడ్డుగూడ, బ్రహ్మన్‌చిచ్యాల, బామానగర్‌, చినరాస్పెల్లి, కుంచవెల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బామానగర్‌ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మణ్‌ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. అలాగే అల్లూరి నాందేవ్‌, దుర్గం శంకర్‌, దూట అంకులు, చింతపూడి అర్జయ్య, ధర్మయ్య ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. గ్రామంలో మూడు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నారు. మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌ బుధవారం తెలిపారు. ఒడ్డుగూడ సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెవెన్యూ అధికారులు ఆస్తి నష్టం వివరాలను సేకరించారు. అకాల వర్షంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. – దహెగాం

Advertisement
 
Advertisement
Advertisement