చింతలమానెపల్లి: పంటల సాగులో రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అమిర్ భాషా, కారుణి అరుణ సూచించారు. శనివారం మండలంలోని బాలాజీఅనుకోడ గ్రా మంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించగా వీరు హాజరయ్యారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాలు, ఎరువుల యాజ మాన్యం, చీడలు, వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, అవసరం మేరకే రసాయన ఎరువుల విని యోగంతో ప్రకృతిని సంరక్షించడం, పంట మార్పి డి ద్వారా సుస్థిర ఆదాయం పొందడం లాంటి అంశాల గురించి వివరించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేయాలని, సాగు నీటిని ఆదా చేసి భావితరాలకు అందించాలని సూచించారు. నా ణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల్లో సమతుల్య ఎ రువుల వినియోగం, సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతుల గురించి వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపా రు. ఏవో కార్తీషా, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.


