అమ్మమ్మ ఇంటికి వచ్చి.. అసువులు బాసి.. | - | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ ఇంటికి వచ్చి.. అసువులు బాసి..

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

● అస్వస్థతతో ఐదేళ్ల బాలుడి మృతి ● మరో ఇద్దరు పిల్లలకు తప్పిన ముప్పు

దహెగాం: అమ్మమ్మ ఊరికి వచ్చిన బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని లోహా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రమేశ్‌ తెలి పిన వివరాల ప్రకారం.. బెజ్జూర్‌ మండలం కుంట లమానెపల్లి గ్రామానికి చెందిన పొర్సెటి శ్రీనివాస్‌–శారద దంపతులు నాలుగురోజుల క్రితం కుమారుడు శ్రీవర్ధన్‌ (5), ముగ్గురు కుమార్తెలతో కలిసి తునికాకు సేకరణకు శారద తల్లిదండ్రుల గ్రామమై న లోహాకు వచ్చారు. శనివారం పిల్ల లను ఇంటి వద్ద ఉంచి తునికాకు సేకరణకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాగా, శ్రీవర్ధన్‌తోపాటు శారద సోదరుడు తలాండి సంతోష్‌ పిల్లలు కీర్తి కుమార్‌, కీర్తన వాంతులు, వి రోచనాలు చేసుకుని కనిపించారు. ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వారు వెంటనే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. కా గా, ఆదివారం ఉదయం శ్రీవర్ధన్‌ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కీర్తికుమార్‌, కీర్తనను మంచి ర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా క్షేమంగా ఉన్నా రు. చిన్నారుల అస్వస్థతకు కారణం తెలియరాలే దు. కాగా, శ్రీవర్ధన్‌ మృతిపై ఎలాంటి అనుమానం లేదని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement