దహెగాం: అకాల వర్షాలతో ధాన్యం రైతులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో ఽఆరబెట్టిన ధాన్యం కుప్పలుగా చేసి టార్పాలిన్లు కప్పడాని కి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి దుమారంతోపాటు చిరు జల్లులు కురిశాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందునా ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు.


