అధికారికంగా శివాజీ జయంతి నిర్వహించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

అధికారికంగా శివాజీ జయంతి నిర్వహించేందుకు కృషి

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

● ఎమ్మెల్యే హరీశ్‌బాబు

చింతలమానెపల్లి: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని ఖర్జెల్లి గ్రామంలో శుక్రవా రం శివాజీ మహరాజ్‌ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజలు చేసి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరె కుల సంఘ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. శివాజీ జీవితం ఆదర్శప్రాయమని, మహనీయుడి చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆరె కులస్తులకు ఓబీసీ ధ్రువీకరణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చింతలమానెపల్లి మండలంలో కమ్యూనిటీ భవనాన్ని ప్రజలందరికీ ఆమోదయోగ్యమయ్యేలా నిర్మిస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయి స్తామని తెలిపారు. శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితో హైందవ ధర్మ రక్షణకు అంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చాపిడె సత్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాస్‌, చౌదరి నానయ్య, టోంబ్రె శ్రీనివాస్‌, డుబ్బుల నానయ్య, డుబ్బుల వెంకన్న, సుల్కరి ఉమామహేశ్‌, చౌదరి రంగయ్య, ఒడీల భాస్కర్‌, అశోక్‌ ఆచార్య, వాను పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement