అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతీ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దహెగాం మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన శంకరమ్మ, ఆసిఫాబాద్‌ పట్టణంలోని బజార్‌వాడీకి చెందిన వేముల మంజుల వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన మనీష విన్నవించింది. జీవనోపాధి కోసం ఆర్థిక చేయూత అందించాలని వాంకిడి మండలం వెల్గి గ్రామానికి చెందిన బాదిరావు అర్జీ అందించాడు. కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆసిఫాబాద్‌ మండలం సాలెగూడకు చెందిన పరాస్‌, సిర్పూర్‌(టి) మండలం వేంపల్లి గ్రామానికి చెందిన అంజి వేర్వేరుగా దరఖాస్తులు అందించారు. సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్‌ కాలనీవాసులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement