ఆసిఫాబాద్‌అర్బన్: అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేశ్ పేర్కొన్నారు. యుక్త వయస్సులో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టవచ్చని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ డ్రైవ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. స్పష్టమైన లక్ష్యంతో జీ వితంలో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్య క్తులతో స్నేహాలు ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని తెలిపారు. వీలైనంత వరకు సోషల్ మీడి యా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని పే ర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులు భవిష్యత్‌లో ఆరో గ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఫీల్ రెస్పాన్స్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగంతో కలిగే శారీరక, మానసిక, సా మాజిక సమస్యల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటుతో వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. నర్సింగ్ విద్యార్థులు కమ్యూనిటీ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. చైల్డ్ ప్రొటక్షన్ అధికారి శ్రవణ్, కౌన్సిలర్‌లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డ్రగ్ వ్యసనం నుంచి బయట పడేందుకు కౌన్సిలింగ్, కుటుంబ మద్దతు, సరైన మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుని, ఒత్తిడిని సానుకూల మార్గాల్లో ఎదుర్కోవాలని సూచించారు. ప్రి న్సిపాల్ పద్మ మాట్లాడుతూ.. చెడు వ్యసనాలతో క లిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమా ల ద్వారా విద్యార్థులో బాధ్యత పెరుగుతుందని తె లిపారు. ఈ సందర్భంగా మదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం పెంపుతో పాటు సమాజంలో డ్రగ్స్ రహిత వా తావరణం నెలకొల్పడానికి ఇది ముఖ్యమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.


