ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న విద్య అందించనున్నట్లు కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించగా ఆమె హాజరయ్యారు. జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన, స్పోర్ట్‌లో జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు నగదు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో లలిత, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎస్వో శ్రీనివాస్, లతీఫ్, శాంతికుమార్, భాగ్యలక్ష్మి, ఏసీజీ జనార్దన్, ఎంఈవో సుభాష్, ఏఎంసీ చైర్మన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, విండో చైర్మన్ అలీబిన్ తదితరులున్నారు.


