హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలి

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

రెబ్బెన: సింగరేణిలో పనిచేస్తున్న బీసీ, ఓబీసీ ఉద్యోగుల హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలని బీసీ, ఓబీసీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నల్లపు రమేశ్‌, ఏరియా ఇన్‌చార్జి పేరం రమేశ్‌ సూ చించారు. శనివారం బెల్లంపల్లి ఏరియా బీసీ, ఓబీ సీ ముఖ్య నాయకుల సమన్వయ సమావేశాన్ని గో లేటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలో బీసీ, ఓబీసీ కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్‌ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నా రు. బీసీ, ఓబీసీ ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ భవిష్యత్‌ కా ర్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఏరియా లైజ న్‌ అధికారి ఎం.రవికుమార్‌, కార్యదర్శి పేరం శ్రీని వాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు మారం శ్రీనివాస్‌, మాసాడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

జీఎంకు సన్మానం

బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న విజయబాస్కర్‌రెడ్డి ఈ నెలాఖరుతో రిటైర్డ్‌ అవుతున్నందున గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బీసీ, ఓబీసీ అసోసియేషన్‌ నాయకులు అతడిని కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ, ఓబీసీ లైజన్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎం.రవికుమార్‌ను జీఎం చేతుల మీదుగా సన్మానించారు. డీవైపీఎం రాజేశ్వర్‌రావు, కమిటీ సభ్యులు స్వామి, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement