ఆసిఫాబాద్: అమ్మ లేకుంటే జీవితమే లేదు. చిన్నప్పుడే నాన్న పోవడంతో అమ్మే అన్నీ తానై పోషించింది. ఇంట్లో విస్తరాకులు కుట్టి కుటుంబాన్ని పోషించింది. అమ్మ చేతి వంట ఏదైనా రుచికరమే. అమ్మ తన ఆకలిని మరిచి పిల్లల కడుపు నింపుతుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచే అమ్మ బిడ్డలకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ లేని వారే నిజమైన పేదవాళ్లు. అమ్మ త్యాగాలు వర్ణించలేనివి. అమ్మను ఆదర్శంగా తీసుకోవాలి.
– ఇరుకుల్ల మంగ, ఏఎంసీ చైర్మన్


