ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేల పింఛన్ స్కీం అమలు చేయాలని జిల్లాకు చెందిన పలువురు ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాగౌడ్, ఉద్యమకారులు గంధం శ్రీనివాస్, సీహెచ్ రవి, జాడి అశోక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


