జిల్లాలో ప్రారంభమైన విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఈ నెల 7 వరకు నిర్వహణ వినియోగదారులు, రైతులకు అవగాహన
కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్: ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యుత్ వాడకంలో వినియోగదారుల్లో భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రాణాంతకమైన ప్రమాదాలను సున్నాకు తగ్గించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. విద్యుత్ భద్రత అనేది కేవలం విద్యుత్ బిల్లు చెల్లించడమే కాదు, తన కుటుంబ భద్రత కూడా అనే నినాదంతో అధి కారులు వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ, ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం ఉండగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సురక్షితంగా ఎలా వాడాలి.. షాక్ తగిలితే ఏం చేయాలి, వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లో ఉండే ప్రమాదాలు, తదితర అంశాల గురించి వివరించనున్నారు.
కార్యక్రమాలు ఇవే..
అవగాహన కల్పించేందుకే వారోత్సవాలు
రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. టీజీ ఎన్‌పీడీసీఎల్ ఆసిఫాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తమ్ జాడేతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలని, విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం, అలసత్వం, అజాగ్రత్తతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.


