ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చీఫ్ నర్సింగ్ అధికారి విజయమ్మ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందుమతి, పద్మను శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ ప్రేమ, ఓర్పు, నేర్పు, సహనానికి ప్రతిరూపంగా అమ్మ నిలుస్తుందని.. అటువంటి త్యాగగుణం అణువణువునా నింపుకున్నవారే నర్సులని పేర్కొన్నారు. అతి తక్కువ వేతనాలతో సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపా రు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలోనూ చాలామంది నర్సులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, స్రవంతి, ప్రసాద్, హెడ్ నర్స్ సఫియా, ఏసు కరుణ, ఎఫ్తర్ రాణి, కుసుమ కుమారి, నర్సింగ్ ఆఫీసర్స్ శ్రీదేవి, భాగ్యలక్ష్మి, లలిత, పద్మ, హేమలత, సుమిత్ర, శ్రీలక్ష్మి, ప్రణయ్, ఈసీజీ టెక్నీషియన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.


