సకాలంలో రుణాలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో రుణాలు చెల్లించాలి

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, ట్రాక్టర్‌ లోన్లు సకాలంలో చెల్లించాలని ఆసిఫాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబిన్‌ అహ్మద్‌ తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడోరోజు బుధవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దళారుల ద్వారా మోసపోకుండా కందులు, జొన్నలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సహకార సంఘాల ద్వారా గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ రుకుం ప్రహ్లద్‌, ఏవో మిలింద్‌, జిల్లా సహకార బ్యాంక్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకట్‌ రవీందర్‌, ఎస్‌బీఐ మేనేజర్‌ తిరుపతి, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement