గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కౌటాల: గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్‌ పేర్కొన్నారు. మండలంలోని కన్నెపల్లి సర్పంచ్‌ మోర్ల పార్వతి ఆది వారం కాంగ్రెస్‌లో చేరగా ఆయన పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కన్నెపల్లి గ్రామాన్ని మో డల్‌ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా మని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, మండలాధ్యక్షుడు నికాడే గంగారాం, నాయకులు సిడాం గణపతి, శ్యాంరావు, మోర్లె పాండురంగ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement