శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్‌ మండలాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో తరగతులు కొనసాగుతున్నాయన్నారు. రూ.1000 రవాణా భత్యం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజూ విద్యార్థులు హాజరయ్యేలా సంబంధిత ఉపాధ్యాయులు చొరవ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సచ్చిదానంద, ఎస్‌వో శ్రీనివాస్‌, ఎంఈవో సుభాష్‌, పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement