అమ్మ దయతోనే ఈ స్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ దయతోనే ఈ స్థాయికి..

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: మంచి సమాజ నిర్మాణానికి, తన బిడ్డలను సరైన దారిలో నడిపిస్తూ అహర్నిశలు వారి భవిష్యత్‌ కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న అమ్మకు వందనం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మ దయే. మా అమ్మ కూలీ పనులు చేసుకుంటూ నేను ఎదగడానికి మూల కారణమైంది. ఇప్పటికీ అమ్మ సలహాలు తీసుకుంటాను. అమ్మ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అమ్మ ఏమి సూచించినా అది మన విజయానికి ఒక మెట్టే అవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం కృషి చేయాలి.

– ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షురాలు

Advertisement
 
Advertisement
Advertisement