ప్రభుత్వం అందించే రూ.5 వేల వేతనం కూడా సక్రమంగా చె ల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ‘సమాన పనికి సమాన వేతనం’ నిబంధ న అమలు పర్చాలి. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.
– చింతకుంట్ల రవి,
వీవోఏ, గోలేటి, మం.రెబ్బెన
సమ్మె నోటీసు ఇచ్చాం
ప్రభుత్వం తమ న్యా యమైన ఆరు డిమాండ్లను పరిష్కరించకపో తే ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ఇందుకు సంబంధించిన నోటీసు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు అందజేశాం. ఈ నెల 6 నుంచి 15 వరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. డి మాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం. – గజ్జెల్లి భీమేశ్,
వీవోఏల సంఘం జేఏసీ రాష్ట్ర కోశాధికారి


