నేటి నుంచి జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు సంసిద్ధం న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ జిల్లాలో 386 మంది వీవోఏలు
వీవోఏలకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి.
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీని వర్తింపజేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న అర్హులైన వీవోఏలకు కమ్యూనిటీ కో ఆర్డినేటర్లుగా(సీసీ) పదోన్నతి కల్పించాలి.
వీవోఏలకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20 లక్షల వరకు కల్పించాలి.
క్షేత్రస్థాయిలో డిజిటల్ పనుల నిర్వహణ కోసం ప్రతి వీవోఏకు ట్యాబ్‌ను ఉచితంగా అందజేయాలి.
తిర్యాణి: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్న వీవోఏలు(గ్రామ సంఘ సహాయకులు) సమస్యల పరిష్కారం కోసం పోరుబాటకు సిద్ధమవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని, సెర్ప్ ఉద్యోగులకు దీటుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రూ.5 వేల వేతనం మాత్రమే చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సంఘాల బలోపేతంలో కీలకం
జిల్లా మొత్తంగా 386 మంది వీవోఏలు విధులు నిర్వహిస్తుండగా, 8,236 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అందులో 94,569 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మ హిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ) బలోపేతంతోపాటు పేదరిక నిర్మూలనలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నా రు. ప్రభుత్వం అందించే రూ.ఐదు వేల వేతనానికి తోడుగా గ్రామ మహిళా సంఘాలు లాభాల్లో ఉంటే అందులో నుంచి మరో రూ.మూడు వేల వేతనం తీసుకునే వెసులుబాటు ఉంది. గ్రామ సంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడంతో పాటు పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధి. గ్రామ సంఘం, మహిళా సంఘాల ఆర్థికపరమైన అంశాలు, పొదుపు, రుణాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం వంటివే కాకుండా, ప్రభుత్వ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తారు. బ్యాంకు రుణాలను అందించి, తిరిగి వాటిని సక్రమంగా చెల్లించేలా చూడటం వంటి విధులు నిర్వర్తిస్తారు.
కార్యాచరణ ఇదే..
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సెర్ప్ సీఈవో కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు.
ప్రధాన డిమాండ్లు


