వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

● కలెక్టర్‌ హరిత ● అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని 15–18 ఏళ్లలోపు బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత సూచించారు. శని వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈ నెల 2నుంచి జూన్‌ 10వరకు నిర్వహించనున్న వేసవి శి బిరాలపై జిల్లా స్థాయి సమన్వయం, క్షేత్రస్థాయి సి బ్బందికి అవగాహన, నిర్మాణాత్మక శిక్షణ ప్రణాళిక అమలుపై ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, వివిధ శాఖల అధికా రులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మండల స్థాయిలో వేసవి శిబి రాలు నిర్వహించాలని సూచించారు. శిబిరంలో వే సవిలో విద్య కొనసాగింపు, ఆరోగ్య సేవల సమన్వ యం, భద్రత అవగాహన, జీవన నైపుణ్యాలు, బా ల్య వివాహాల నివారణ కార్యక్రమాలపై దృష్టి సా రించాలని సూచించారు. రోజువారీ కార్యక్రమాలు ఒకరికొకరు తెలుసుకోవడం, బాల్య వివాహాల ని రోధం, ఆరోగ్య మేళా, అవగాహన, వ్యక్తి గత అవసరాలు, సవాళ్లు, సురక్షిత గ్రామ ప్రణాళిక, సురక్షిత గ్రామం, సమాజంతో సంభాషణ, ఆర్థిక అవగాహ న, శారీరక దారుఢ్యం, ఆటలు, విద్యా కేరీర్‌, మార్గదర్శనం, సైబర్‌ భద్రత, స్వతంత్ర ప్రమాణానికై శిక్షణ ఇచ్చి వారిలో మనోధైర్యం నింపాలని సూచించా రు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి వేసవి శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాల ని వివరించారు. డీఆర్డీవో దత్తారావ్‌, డీటీడీవో ర మాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఉమర్‌ హుస్సేన్‌, సెర్ప్‌ డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

ఆసిఫాబాద్‌: కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్దకు ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి రానున్నందున అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిత సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్‌ నిర్మాణ ప్రాంతాన్ని సీఎం, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెలీప్యాడ్‌, వేదిక, బారికేడ్లు, వీఐపీ గ్యాలరీ, అధికారుల పాసులు, మీడియా పాసులు, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, వీఐపీలకు అల్పాహారం, భోజనాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది క్యాంపులతో సిద్ధంగా ఉండాలని, విద్యుత్‌ సరఫరా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ అందుబాటులో ఉంచాలని తెలిపారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement