విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కళా నైపుణ్య సాంస్కృతిక దినోత్స వం (కళాయవనిక) కార్యక్రమంలో డీఈవో లలితతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రతీ ఒ క్కరి జీవితంలో విద్యతో పాటు పైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, క్రీడలు వ్యక్తిగత విజయానికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా చేస్తున్న బోధనతో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు హస్తకళలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చినవారిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్వో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement