‘ప్రజాపాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి’

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజల భాగస్వామ్యంతోనే సంక్షే మ పథకాలు సక్రమంగా అమలవుతాయని, ప్రజా పాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమని ఎ మ్మెల్సీ దండె విఠల్‌ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని ఎస్పీఎం క్లబ్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేర్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అర్హులందరికీ ల బ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, వైద్యం, వ్యవసాయ సమస్యలపై చర్చించారు. సర్పంచులు గ్రామంలో నెలకొ న్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అధికారులు శాఖలవారీగా నివేదికలు చదివి వినిపించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాహిన్‌ సుల్తానా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, తహసీల్దార్‌ మధూకర్‌, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, డీఎస్పీ వహీదొద్దీన్‌, ఏడీఏ మనోహర్‌, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

కుర్చీలు లేక తిప్పలు

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరయ్యారు. హాల్‌లో వేసిన కుర్చీలు నాయకులు, అధికారులతోనే నిండిపోయాయి. దీంతో చాలామంది జనం గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. అధికారులు చేసిన ఏర్పాట్లపై ప్రజలు అసహనం వ్యక్తంజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement