ముగిసిన విద్యావారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విద్యావారోత్సవాలు

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాలు ఆదివారం ముగిశాయి. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగింపు వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎం మేనేజర్‌ గిరి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. విద్యావారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకోవ డం అభినందనీయమని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి ఎస్పీఎం మిల్లు తరఫున తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపా రు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. కళాశాల ప్రిన్సి పల్‌ శ్రీదేవి, వైస్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీనరసింహం, జనార్దన్‌, దేవేందర్‌, శారద, రాజేశ్వర్‌, దత్తాత్రేయ, వెంకటేశ్వర్‌, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement