కాగజ్‌నగర్‌టౌన్: అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ బోరిగాం శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. కాగజ్‌నగర్‌కు మొదట విడతలో 630 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చేశామని, మిగిలిన అర్హులకు మరో విడతలో అందిస్తామని తెలిపారు. పట్టణంలో రహదారి విస్తరణ, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రహదారుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుమురంభీం ప్రాజెక్టు ఆయకట్ట పనులు సీడబ్ల్యూసీ నివేదిక రాగానే ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. పట్టణానికి రూ.18 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతానికి సాగునీరు అంది భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సమష్టిగా కృషి చేద్దామని తెలిపారు. పోడు భూములు సాగు చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్న సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సంక్షేమం కోసం ఎస్పీఎం యజమాన్యం దృష్టి సారించాలని కోరారు. అనంతరం 288 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, గృహనిర్మాణ శాఖ పీడీ టీఎస్ ప్రకాశ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


