ఎనీమియా పడగ..! | - | Sakshi
Sakshi News home page

ఎనీమియా పడగ..!

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

చిత్రంలో కనిపిస్తున్న కెరమెరి మండలంలోని కెస్లాగూడ (ఓజీగూడ)కు చెందిన మడావి సుమన్‌బాయికి రెండేళ్ల క్రితం గర్భస్రావమైంది. అప్పటినుంచి ఆమె అనారోగ్యంతో బాధ పడుతోంది. రక్తం తక్కువగా ఉండడంతో పలుచోట్ల చికిత్స చేసినా పెరగలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు క్షయ సోకింది. ఇందుకు సంబంధించిన మాత్రలు వాడుతోంది. శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను కుటుంబీకులు జైనూర్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేయకుండానే ఇంటికి పంపించారు. దీంతో ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం కెరమెరి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందింది. రక్తహీనతతో మహిళలు మరణించడం జిల్లాలో ఇది కొత్తేమి కాదు.

Advertisement
 
Advertisement
Advertisement