ఏళ్లుగా ‘ఉత్తి’పోతలే..! | - | Sakshi
Sakshi News home page

ఏళ్లుగా ‘ఉత్తి’పోతలే..!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

● జిల్లాలో నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు ● సాగు నీరందక బీళ్లుగా పంట భూములు ● పునరుద్ధరించాలని రైతుల డిమాండ్‌

(ఎకరాల్లో) (రూ.కోట్లలో)

బోర్లు, బావులే ఆధారం

సాండ్‌గాం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఏటా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుండే. నాలుగేళ్లుగా అది నిరుపయోగంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో పంటలు పండడం లేదు. బోర్లు, బావులపై ఆధారపడి సాగు చేస్తున్నాం. అధికారులు, పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వెంటనే వినియోగంలోకి తెచ్చి అన్నదాతలకు సాగునీరందించాలి. – దామోదర్‌, మాజీ సర్పంచ్‌, సాండ్‌గాం

ఫొటోలో కనిపిస్తున్న ఎత్తిపోతల పథకం కౌటాల మండలం వీర్దండి సమీపంలోని పెన్‌గంగ నది తీరాన ఉంది. 2011లో దాదాపు 3 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీనిని నిర్మించారు. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తిపోతల పథకంలోని యంత్రాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.లక్షల నష్టం వాటిల్లింది.

కౌటాల: జిల్లాలో పెన్‌గంగ, వార్దా, ప్రాణహిత వంటి జీవనదులు ఉన్నా సాగుకు మాత్రం చుక్క నీరందని దుస్థితి నెలకొంది. కాలంతో సంబంధం లేకుండా నదులు నిత్యం జలకళతో ఉన్నప్పటికీ భారీ ప్రా జెక్టులు లేకపోవడంతో స్థానిక రైతులు ఇప్పటికీ 90 శాతం పంటలు కేవలం వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. ఏళ్లుగా నిరుయోగంగా ఉన్న యంత్రాలకు రక్షణ కరువైంది. దుండగులు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఎత్తుకెళ్తున్నారు.

పథకాలు సరే.. ఫలితమేది?

ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదుల నుంచి నీటిని మళ్లించి పంటలను కాపాడటానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చే శారు. ప్రాణహిత నదిపై సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో ఏడు ఎత్తిపోతల ప థకాలు నిర్మించారు. కౌటాల మండలంలో తుమ్మిడిహెట్టి, వీర్ధండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గతంలో సాండ్‌గాం ఎత్తిపోతల పథకం ద్వారా వీరవెల్లి, కౌఠి, సాండ్‌గాం, పార్డీ గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందింది. అప్పట్లో రైతులు ఏటా మూడు పంటలు పండించి ఆదర్శంగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కోసం సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, రైతుల మధ్య సమన్వయ లోపం కారణంగా నాలుగేళ్లుగా సాండ్‌గాం పథకం కూడా మూలనపడింది. పచ్చని పొలాలు ఇప్పుడు బీళ్లుగా మారా యి. పెద్ద ప్రాజెక్టులు అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సాండ్‌గాం పథకం పునరుద్ధరిస్తే ఆయకట్టు రైతులకు భరోసాగా ఉంటుంది.

అన్నదాతల ఆక్రందన

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు చివరకు కన్నీటి వేదనే మిగులుతోంది. వారి ఆక్రందనను వినేవారు కరువవుతున్నారు. రేయింబవళ్లు చెమట చుక్కలు చిందించి సాగు చేసిన పంటలు, చేతికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ప్రకృతి పగబట్టినప్పుడల్లా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు సక్రమంగా కురవకపోతే సాగు ప్ర శ్నార్థకంగా మారుతోంది. నిరుపయోగంగా ఉన్న ప థకాలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతు న్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసిన దాఖలాలు లేవు. రానున్న వర్షాకాలం సీజన్‌ ప్రారంభంలోగా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎత్తిపోతల పథకాల వివరాలు

మండలం గ్రామం ఆయకట్టు వ్యయం

కౌటాల తుమ్మిడిహెట్టి 1,000 3

కౌటాల సాండ్‌గాం 5,000 29

చింతలమానెపల్లి రణవెల్లి 4,750 28

చింతలమానెపల్లి కోర్సిని 3,995 36

చింతలమానెపల్లి గూడెం 2,000 17.50

సిర్పూర్‌(టి) హుడ్కిలి 1,400 3

సిర్పూర్‌(టి) లోనవెల్లి 1,100 2

కెరమెరి సుర్జాపూర్‌ 1,200 3

కాగజ్‌నగర్‌ జంబుగ 400 1.5

Advertisement
 
Advertisement
Advertisement