అందరి భాగస్వామ్యంతోనే అటవీ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అందరి భాగస్వామ్యంతోనే అటవీ అభివృద్ధి

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

చింతలమానెపల్లి: ప్రజలందరి భాగస్వామ్యంతోనే అటవీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎఫ్‌డీవో అప్పయ్య అన్నారు. ఖర్జెల్లి, దిందా బీట్‌లలో నెలకొన్న పోడు సమస్యపై గురువారం ఖర్జెల్లి గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అటవీ అధికారులు, పోడు రైతులకు మధ్య ఉన్న పోడు సమస్యను ఇరువర్గాలు పరిష్కరించుకున్నాయి. ఎఫ్‌డీవో మాట్లాడుతూ అటవీ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు అటవీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అటవీ భూముల విషయంలో ఆయా గ్రామాల ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. పలువురు పోడు రైతులు మాట్లాడుతూ అడవుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు. కొత్తగా అటవీభూములు ఆక్రమించమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement