చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మండలంలోని బురదగూడ చెరువు పునరుద్ధరణ పనులను బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు కట్ట తెగి ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఓఎండీఎం నిధులు రూ.35 లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలోగా చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొత్రే లక్ష్మి, ఇరిగేషన్‌ ఈఈ ప్రభాకర్‌, డీఈ తిరుపతి, ఏఈ స్వామి, నాయకులు గోపాల్‌, ప్రభాకర్‌, కార్తీక్‌, భరత్‌, బాబురావు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement