చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

● ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఆవులు, దూడల అక్ర మ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లో కి తీసుకుంటే చర్యలు తప్పవని, వ్యక్తిగత దాడుల కు పాల్పడటం నేరమని ఎస్పీ నితిక పంత్‌ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ప శువుల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్ట పరమైన అంశాలపై గోరక్షణ కమిటీతో స మావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ గోరక్షకుల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయ డం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యల కు పాల్పడవద్దని సూచించారు. సమాచారం తెలిస్తే వెంటనే 87126 70505, 87126 70557, స్థానిక పోలీసులు, డయల్‌ 100కు సమాచారం అందించా లన్నారు. ఇప్పటికే జిల్లాలో 14 చెక్‌పోస్టులు ఏర్పా టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, గోరక్షక్‌ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కించపర్చే పోస్టులు పెడితే కేసులు నమోదు

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు, వర్గాలు, సమాజాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ నితిక పంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అసభ్యకర, విద్వేషపూరిత పోస్టులు గమనిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement