స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫీడ్‌బ్యాక్‌ | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫీడ్‌బ్యాక్‌

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2026 కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ మున్సి పాల్టీలో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సేకరణ ముమ్మరంగా సాగుతోంది. శనివారం మున్సిపల్‌ సిబ్బంది వార్డులు, ఆయా కాలనీల్లో తిరుగు తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. చెత్త సేకరణ, బహిరంగ మలవిసర్జన రహిత పట్టణం, తడి, పొడి చెత్త వేరు చేయడం, వీ ధుల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ, పబ్లిక్‌ టాయిలెట్ల పరిస్థితి, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై మొత్తం ఏడు ప్రశ్నలకు ప్రజల ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. చాలా బా గుంది.. నుంచి అస్సలు బాగాలేదు.. వరకు నాలుగు ఆప్షన్లలో సమాధానం నమోదు చేస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement