ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కౌటాల(బెజ్జూర్‌): గ్రామీణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా బెజ్జూర్‌ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెడిలైఫ్‌ ఆస్పత్రి సహకారంతో ఆదివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడకుండా ప్రజలు ముందస్తు వైద్యపరీక్షలు చేయించుకోవడమే మేలని పేర్కొన్నారు. వేసవి నేపథ్యంలో ఎండల్లో తిరగవద్దని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రతతో పాటు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమస్యలుంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌ లేదా ‘డయల్‌ 100’ను సంప్రదించాలని సూచించారు. వైద్యశిబిరంలో 600మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదొద్దీన్‌, కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, బెజ్జూర్‌ ఎస్సై సర్తాజ్‌ పాషా, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement