కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

నస్పూర్‌: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య తెలిపారు. శనివారం ఆర్‌కే–7 గనిని వారు సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని సర్ఫేస్‌ డ్యూటీలో పెట్టాలని సీఎంవో సిఫారసు లేఖ ఇస్తున్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్మికుల సమస్యలను గని మేనేజర్‌ తిరుపతికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏరియా సెక్రటరీ బాజీసైదా, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ బెల్లంపల్లి రీజియన్‌ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్‌, పిట్‌ సెక్రటరీ మారుపల్లి సారయ్య, అసిస్టెంట్‌ పిట్‌ సెక్రటరీ సదానందం, నాయకులు బానేశ్‌, యాదగిరి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement