రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

● ఎమ్మెల్సీ దండె విఠల్‌

కాగజ్‌నగర్‌రూరల్‌: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని వంజీరి రైతు వేదికలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డివిజన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూసారం దెబ్బతిని వరి, పత్తి సాగులో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఆయిల్‌పాం, డ్రాగన్‌ఫ్రూట్‌, కూరగాయల సాగుతో ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందిస్తుందని, అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కోసిని రైతులు మాట్లాడుతూ గ్రామ శివారు నుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగలతో మంటలు చెలరేగి పామాయిల్‌ చెట్లు కాలిపోతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ విద్యుత్‌ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వందశాతం రాయితీపై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హర్టిక ల్చర్‌ డివిజన్‌ అధికారి సుప్రజ, ఏడీఏ మనోహర్‌, ఏవో రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement