ఆసిఫాబాద్‌అర్బన్: సమాజానికి పరిచయం చేసిన అమ్మే నాకు తొలి గురువు. బిడ్డల భవిష్యత్ కోసం నిత్యం శ్రమిస్తూ వాళ్ల ఆనందంలోనే తమ సంతోషాన్ని చూసుకునే అమ్మ గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. సృష్టిలో అమ్మే మనకు తొలిగురువు. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటాను. అమ్మ అనే పిలుపులో ఎంతో మాధుర్యం ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మ చూపించిన మార్గంలో వెళ్లినందునే. అమ్మ అంటే భరోసా, ఓ ధైర్యం.
– సిద్దంశెట్టి సుహాసి, బీజేవైఎం రాష్ట్ర నాయకురాలు


