రెబ్బెన: సింగరేణి(డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని మంగళవారం ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 25 రోజుల పాటు ఈ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. ఫుట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో శిక్షకులు మెలకువలు నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కిరణ్, సీఎంవోఏఐ ఉపాధ్యక్షుడు వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ ఎస్వీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, శిక్షకులు నరేష్, సంపత్, ఓమిత్ పాల్గొన్నారు.


