దహెగాం: గుంతలతో అధ్వానంగా మారిన మండలంలోని ఇట్యాల నుంచి గొర్రెగుట్ట వరకు బీటీరోడ్డు మరమ్మతులకు గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూ జ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెన్యువల్ బీటీ కోసం ఎంఆర్‌ఆర్ పథకం కింద రూ.1.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ.1,700 కోట్లు అవసరమని సంబంధిత శాఖ ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. గొర్రెగుట్ట నుంచి కేస్లాపూర్ వరకు బీటీరోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజ్జెల జయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.


