ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 7నాటి సీఎం పర్యటనకు ముందే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని శివాజీ భవన్‌లో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్ ఎత్తు 148 నుంచి 150 అడుగులకు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవాల్సిన బాధ్యత సిర్పూర్ ఎమ్మెల్యేతో పా టు ఆదిలాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిపై ఉందని పేర్కొన్నా రు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద ని, రెండు విడతల్లో మంజూరు చేసి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్, రాజేందర్ తదితరులున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్: రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త మహేశ్ సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలో ఎల్లారం గ్రామంలో రైతులకు సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రతీ సంవత్సరం ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రజుమంలో ఏఈవో స్వాతి, ప్రియ, సుగంధి, సర్పంచ్ సీతారాం, రైతులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన రైతులు


