ఆసిఫాబాద్‌అర్బన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. విద్యావా రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన గ్రంథాల య దినోత్సవానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఈవో లలితతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడు తూ యువత పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయాల్లో నవలలు, చరి త్ర పుస్తకాలు, మహనీయుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాల సాధనకు గ్రంథాలయాలు చక్కని వేదికగా ఉపయోగపడతాయన్నారు. అనంతరం గ్రంథాలయంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రంథాలయశాఖ అధికారులు, కవులు పాల్గొన్నారు.
ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ఆసిఫాబాద్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. న్యూఢిల్లీ నుంచి శుక్రవారం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వర్షాకాలంలో వరదలు, విపత్తులతో ఆస్తులు, ప్రాణనష్టం జరగకుండా అధికా రులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ, అతిభారీ వర్షాలు కురిసే సమయంలో జనజీవనం స్తంభించిపోతుందని, ఆ సమయంలో ప్రజలను రక్షించి పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెస్క్యూ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


