ఆసిపాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో డీఈవో లలితకు సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఎంఐఎస్, సీసీవో, సీఆర్‌పీలకు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీసీవో సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, ఎంఐఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు గేడేకర్ సంతోష్, సీఆర్‌పీల సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, సీసీ రాము, నాయకులు సందీప్, నాగేష్, తిరుపతి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


