రెబ్బెన: జిల్లాలో 2023– 24 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎఫ్‌సీ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని మాజీ జెడ్పీటీసీ వేముర్ల సంతోష్, గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు కోరారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్‌లో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ 2023–24 సంవత్సరంలో జిల్లాలో 176 పనులకు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించిందన్నారు. 116 పనులు పూర్తి చేయగా రూ.3.94 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేసినా నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు.


