బాల్య వివాహం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం అడ్డగింత

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

వాంకిడి: మండలంలోని గోయెగాం గ్రామంలో నిర్వహిస్తున్న బాల్య వివాహాన్ని శనివా రం అధికారులు అడ్డుకున్నారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 నంబర్‌కు అందిన సమాచారం మేరకు బాలల రక్ష భవన్‌, పోలీస్‌, రెవెన్యూ, ఐసీడీఎస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు బాల్య వి వాహాలతో కలిగే అనర్థాలు, చట్ట పరమైన చర్యల గురించి వివరించారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్‌ తెలి పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగినచర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఏసీడీపీవో ఉమా ఫాతిమా, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ దుర్గం దీపక్‌, కేస్‌ వర్కర్లు వెంకటేశ్వర్లు, సుకన్య ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement