కాగజ్‌నగర్‌టౌన్: ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో కళకళలాడిన జిల్లాలోని అతిపెద్ద పరిశ్రమ ఎస్పీఎం పేపర్ మిల్లు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మిల్లు పునరుద్ధరణపై ఆశలు వ్యక్తమవుతున్న తరుణంలో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడం ఆ వర్గాల్లో అనేక అనుమానా లకు తావిస్తోంది. ప్రస్తుతం మిల్లులో 393 మంది ప ర్మినెంట్ కార్మికులు పని చేస్తున్నారు. ట్రేడ్ యూని యన్ ఎన్నికలు ఎనిమిదేళ్లుగా నిర్వహించలేదు. అ ప్పటినుంచి తాత్కాలిక కమిటీలతోనే వ్యవహారాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి ఎన్నికలపై యా జమాన్యం, సంబంధిత కార్మిక శాఖ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. 2014లో అప్పటి యాజమాన్యం వివిధ కారణాలతో షెడ్‌డౌన్ చేసింది. అనంతరం 2018లో ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు ఆధారంగా జేకే మిల్లు యాజమాన్యం కార్మికులపై ఆంక్షలు విధించి విధుల్లోకి తీసుకుంది. ఎనిమిదేళ్లుగా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని కార్మికులు వాపోతున్నారు.
కోర్టు కేసు కొట్టివేసినా..
మిల్లు పునరుద్ధరణ తర్వాత మిల్లు యాజమాన్యం ఇక్కడి గుర్తింపు కార్మిక సంఘాలకు అర్హత లేదని రెండేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేసింది. ఇందుకు ఇ క్కడున్న కార్మిక సంఘాల నాయకులు తమకు అర్హ త ఉందని పూర్తి ఆధారాలను హైకోర్టుకు అందజేశా రు. దీంతో ఎస్పీఎం యాజమాన్యం వేసిన కేసు కొ ట్టేసింది. మళ్లీ తాజాగా నూతన నాలుగు లేబర్ కోడ్ ల విధానం ప్రకారం కార్మిక శాఖకు బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని కార్మిక శాఖపై ఎ స్పీఎం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తె లంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ మాత్రం ఎన్నికలు జరగన్వికుండా చేస్తుండడంతో యాజమాన్యం తీరుపై గుర్తింపు సంఘం నాయకులు మండిపడుతున్నారు.
ఎటూ తేలని ఎన్నికల వ్యవహారం
మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కార్మికశా ఖ ఉన్నతాధికారులకు ఆరునెలల క్రితమే వినతిపత్రాలు ఇచ్చారు. మిల్లులో ట్రేడ్ యూనియన్ ఎన్నిక ల కోసం ఇక్కడున్న కార్మిక సంఘాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అందరికీ నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కార్మికశాఖ అధికారులకు ట్రేడ్ యూనియన్ నాయకులు అందజేసినా ఎన్నికల విషయంలో ఎటూ తే లని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 11న ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు హైదరాబాద్‌లోని కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి దాసరి హరిచందనను కలిసి ఎస్పీఎం మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు.
కార్మికుల సంఖ్య తగ్గడమే కారణమా?
ప్రస్తుతం మిల్లు పునరుద్ధరణ ఉద్యోగాల భరోసా, పెండింగ్ బకాయిల చెల్లింపులు లాంటి కీలక అంశాలు ముందున్నవేళ కార్మిక సంఘం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు కార్మిక సంఘం నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు జరిగితే కార్మికుల అభిప్రాయాలకు ప్రతిబింబంగా కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుందని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లగలదని కార్మికులు పేర్కొంటున్నారు. మరో వైపు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి మిల్లు పరిస్థితులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం, పరిపాలన కారణాలు కూడా కారణమై ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘం ఎన్నికలు జరగాల్సిందేనని కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత సంఘం ప్రతినిధుల చట్టబద్ధత ఏమిటనే.. అనేక ప్రశ్నలు కార్మికుల్లో వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు, కార్మికశాఖ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.


